ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, విప్‌కు నిరసన సెగ
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గురువారం అటువైపు వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
- కాన్వాయ్‌ని అడ్డుకున్న ఇటికాలపల్లి వాసులు
- అనర్హులకు ఇండ్లు ఇచ్చారంటూ ఆరోపణ
బచ్చన్నపేట, నవంబర్ 5 : డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ గురువారం అటువైపు వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలోని కొన్నెలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ విప్ వేముల వీరేశం వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న బాధితులు రోడ్డుపైకి వచ్చి వారి కాన్వాయ్ అడ్డుకున్నారు.
నాలుగేండ్ల క్రితం గ్రామసభలో తమకు ఇండ్లు కేటాయించారని, అప్పటి నుంచి అందులో ఉంటున్నామని తెలిపారు. తీరా ఇటీవల రెవెన్యూ అధికారులు జనగామ జిల్లా కేంద్రంలో లాటరీ పద్ధతిలో తిరిగి 18 ఇండ్లకు డ్రా తీయడం, అందులో తమ పేర్లు కాకుండా, అనర్హుల పేర్లు రావడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా జరుగలేదని ఆరోపించారు. అధికార పార్టీ నేతల వాహనాలను అడ్డుకొని వారికి చుక్కలు చూపించారు. లాటరీ పద్ధతిని తాము ఒప్పుకోబోమని, ఇండ్లను వదిలి వెళ్లేది లేదని స్పష్టంచేశారు.
సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులతోపాటు ఎస్సై శ్రీకాంత్, పోలీసు బలగాలు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి కాన్వాయ్‌ని పంపిస్తుండగా ‘ఆపండి సార్.. దండం పెడుతాం.. మాకు ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగింది’ అంటూ మహిళలు మొరపెట్టుకున్నా సామేల్, దయాకర్, వీరేశం వారి మాటలు వినిపించుకోకుండా తప్పించుకొనిపోయారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

