విజయరామరాజు టైటిల్‌రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకుడు. శ్రీని గుబ్బల నిర్మాత. విడుదలకు ముందే 46 అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రం ఈ నెల 29న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఇది తన తొమ్మిదేళ్ల కల అని, మా టీమ్ చేసిన ఆరేళ్ల హార్డ్ వర్క్ 29న అంతా చూడబోతున్నారని, ఒక డెబ్యూ డైరెక్టర్‌కి ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంతకంటే ఎక్కువే తనకు నిర్మాత ఇచ్చారని, హీరో విజయరామరాజు ప్రాణం పెట్టి పనిచేశారని, ఈ సినిమా టీమ్ వర్కనీ, సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంటుందని దర్శకుడు విక్రాంత్ రుద్ర చెప్పారు.
ఈ సినిమానే తమను ముందుకు తీసుకెళ్లిందని, తన కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అని హీరో విజయరామరాజు అన్నారు. ఇంకా కథానాయిక సిజా రోజ్, నిర్మాత శ్రీని గుబ్బల, నటులు అజయ్, దయానందరెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకాటి, సంగీతం: విఘ్నేష్ భాస్కరన్.