హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : విజ్ఞాన్స్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవాన్ని శనివారం చేబ్రోలు మం డలం వడ్లమూడిలోని వర్సిటీ ప్రాంగణం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అటార్నీ జనరల్ డాక్టర్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ.. సత్యం, జ్ఞానం, న్యాయం కోసం నిరంతరం అన్వేషణ చేసే వేదికలుగా విశ్వవిద్యాలయాలు నిలువాలని ఆకాంక్షించారు.
వివిధ రంగాల్లో కృషి చేసిన నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్ నన్నపనేని, గ్రీన్కో ఫౌండ ర్, ప్రెసిడెంట్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు విజ్ఞాన్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. మొత్తం 2,599 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసినట్టు వర్సిటీ వీసీ కేవీ క్రిష్ణకిషోర్ తెలిపారు. 63 మందికి బంగారు పతకాలు అందజేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్లర్ సుబ్బారావు, సీఈవో మేఘన, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు పాల్గొన్నారు.