Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Vidya Balan | భారతీయ సంగీత దిగ్గజం, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కాల్సిన బయోపిక్‌లో నటించాలనే తన చిరకాల వాంఛ నెరవేరకపోవడంపై ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరోసారి తన మనసులోని వేదనను పంచుకున్నారు.
Vidya Balan | భారతీయ సంగీత దిగ్గజం, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కాల్సిన బయోపిక్‌లో నటించాలనే తన చిరకాల వాంఛ నెరవేరకపోవడంపై ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ మరోసారి తన మనసులోని వేదనను పంచుకున్నారు. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు.
ఈ సినిమా ప్రణాళిక గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ.. 2014లోనే ప్రముఖ దర్శకుడు రాజీవ్ మేనన్‌తో కలిసి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితంపై ఓ సినిమా తెరకెక్కించాలని పక్కాగా నిర్ణయించుకున్నాం. రాజీవ్ గారు ఎంతో అద్భుతమైన స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. కానీ, ఆ చిత్రంపై కొన్ని కారణాల వల్ల స్టే ఆర్డర్ రావడంతో మేం ముందుకు వెళ్లలేకపోయాం’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి అంటే తనకు ఎంతటి ప్రాణమో విద్యాబాలన్ వివరిస్తూ.. ‘‘మా ఇంట్లో ప్రతిరోజూ ఉదయం ఆమె గొంతుతో పలికిన ‘వెంకటేశ్వర సుప్రభాతం’తోనే ప్రారంభమవుతుంది. ఆమె సంగీతం అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆమె జీవిత విశేషాల గురించి నాకు చాలా విషయాలు తెలుసు. అందుకే ఆమె పాత్రలో నటించడం నా జీవితాశయం. అది కాస్తా నెరవేరకుండానే నిలిచిపోవడం ఇప్పటికీ నన్ను ఎంతో బాధిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా చేయలేకపోయినా, తన మనసులోని కోరికను కొద్దిపాటిగానైనా సంతృప్తిపరుచుకునేందుకు ఫొటోషూట్ చేసినట్లు ఆమె తెలిపారు. రెండేళ్ల క్రితం ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి ఘన నివాళులర్పిస్తూ ప్రత్యేకంగా ఓ ఫొటోషూట్ నిర్వహించామని, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయని పేర్కొన్నారు. ఆ తర్వాత తనకు అలాంటి పాత్రల కోసం మరిన్ని ఆఫర్లు కూడా వచ్చాయని ఆమె తెలిపారు. కాగా, ప్రస్తుతం రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఎం.ఎస్’ అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రానికి ‘ఏ లెగసీ ఆన్ స్క్రీన్’ అనే ఉపశీర్షికను ఖరారు చేశారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Parliament session | డీలిమిటేషన్ బిల్లు, మహిళా కోటా బిల్లుల ఆమోదానికి ప్రత్యేక పార్లమెంట్ సెషన్.. ఈ నెలలోనే
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

