బాస్కెట్ బాల్‌కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న మహిళ వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హౌ థింగ్స్ వర్క్ అనే పేజ్ ఈ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేయగా ఇప్పటివరకూ 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
16 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ క్లిప్‌లో ఓ మహిళ ఫ్యాక్టరీలో బాస్కెట్‌బాల్‌కు రంగులద్దుతూ కనిపించారు. ఆమె ముందున్న బ్లాక్ పెయింట్ బౌల్ నుంచి బాస్కెట్ బాల్‌పై నలుపు రంగు లైన్స్‌ను పెయింట్ చేస్తూ కనిపించారు. బాస్కెట్ బాల్‌కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
Applying the finishing touches to a Basketball🏀 pic.twitter.com/9nnNekqLbF
— H0W_THlNGS_W0RK (@HowThingsWork_) March 15, 2023
మహిళ శ్రద్ధగా బాస్కెట్ బాల్‌కు ఫైనల్ టచ్ ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. అద్భుతమని ఓ యూజర్ కామెంట్ చేయగా మనోహరమని మరో యూజర్ రాసుకొచ్చారు. బాస్కెట్ బాల్‌పై నలుపు రంగు గీతలను సీమ్స్ అని పిలుస్తారు. ఇవి బాల్‌ను ఈజీగా హ్యాండిల్ చేసేందుకు గ్రిప్ ఇచ్చేందుకు ఉపకరిస్తాయి. బాల్‌పై ప్లేయర్‌కు గ్రిప్ పెంచేందుకు ఈ లైన్స్ సహకరిస్తాయి.
Read More :