న్యూఢిల్లీ : నార్వే డ్యాన్స్ టీం క్విక్ స్టైల్ ముంబై లోకల్ ట్రైన్లో పెర్ఫామ్ చేసిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముంబై లోకల్ ట్రైన్లో లేకే పెహలా పెహలా ప్యార్ సాంగ్ రీవ్యాంప్ వెర్షన్‌కు వారు క్రేజీ స్టెప్స్‌తో హోరెత్తించారు. లోకల్ ట్రైన్లో డ్యాన్స్ పెర్ఫామెన్స్ వీడియోను నార్వే డ్యాన్స్ టీం తమ ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణీకులందరూ చూస్తుండగా డ్యాన్స్ టీం హుషారైన మూమెంట్స్‌తో హోరెత్తించడం కనిపించింది. భారత్‌లోని లోకల్ ట్రైన్లో మా తొలి స్టెప్ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
వీరి డ్యాన్స్ అద్భుతమని బోట్ సహ వ్యవస్ధాపకులు అమన్ గుప్తా కామెంట్ చేశారు. నార్వే డ్యాన్స్ టీం క్రేజీ మూమెంట్స్‌తో ఆకట్టుకుందని పలువురు యూజర్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు. అంతకుముందు విరాట్ కోహ్లీతో డ్యాన్స్ చేసిన వీడియోను ఈ బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Read More :