చీఫ్ ఆఫ్ మెటీరియల్‌గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ సందీప్ నైథానీ..

ఢిల్లీ, జూన్ 1: ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్ గా, వైస్ అడ్మిరల్ సందీప్ నైథానీ, ఎవిఎస్ఎం, విఎస్ఎంగా మంగళవారం ఛార్జి తీసుకున్నారు. పూణె ఖడకవస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి చెందిన గ్రాడ్యుయేట్ అయిన ఆయనను 1985,జనవరి 1న భారతీయ నావికాదళ ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో నియమించారు. ఐఐటి ఢిల్లీ నుంచి రాడార్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాను పొందిన అడ్మిరల్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ (డిఎస్ఎస్సి), నేషనల్ డిఫెన్స్ కాలేజీ (ఎన్డిసి)కి చెందిన ప్రముఖ పూర్వ విద్యార్ధి కూడా.
నావికాదళంలో తన మూడున్నర దశాబ్దాల తన కెరీర్లో అడ్మిరల్ పలు సవాళ్ళతో కూడిన పదవులను నిర్వహించారు ఆయన. ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ విరాట్‌లో వివిధ స్థాయిల్లో సేవలను అందించారు. అలాగే, ముంబై, విశాఖపట్నం నావల్ డాక్ యార్డులలో, నావికాదళ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది, మెటీరియల్ శాఖలలో కీలక పదవులను నిర్వహించారు. నావికాదళానికి చెందిన ప్రతిష్ఠాత్మక ఎలక్ట్రికల్ ట్రైనింగ్ సంస్థ ఐఎన్ఎస్ వల్సురాను అడ్మిరల్ నిర్వహించారు.

ఫ్లాగ్ ఆఫీసర్‌గా ఆయన నావికాదళ కేంద్రకార్యాలయంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ మెటీరియల్ (ఆధునీకరణ), చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (టెక్నీకల్) కేంద్రకార్యాలయం డబ్ల్యుఎన్‌సి, ముంబై నావల్ డాక్ యార్డు అడ్మిరల్ సూపరింటెండెంట్‌గా, ముంబైలో నావికాదళ ప్రాజెక్టు డైరెక్టర్ జనరల్‌గా, ప్రోగ్రామ్ డైరెక్టర్ కేంద్రకార్యాలయం ఎటివిపి, నావికాదళ కేంద్రకార్యాలయంలో యుద్ధ నౌకల ఉత్పత్తి, స్వాధీనం కంట్రోలర్ గా అడ్మిరల్ సేవలు అందించారు.
భారతీయ నావికాదళంలో ప్రధాన స్టాఫ్ ఆఫీసర్, అత్యంత సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా నౌకలు, సబ్ మెరైన్ల అన్ని ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆయుధాలు, సెన్సార్ల, ఐటి సంబంధిత పరికరాలు, వ్యవస్థలు నిర్వహణ, ఉత్పత్తి జీవిత కాల మద్దతు, నావికాదళ పరికరాల స్వదేశీకరణ, ప్రదాన నావికాదళ, సాంకేతిక మౌలికసదుపాయాలకు అడ్మిరల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

