Mammootty | మాలీవుడ్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ నటుడు మమ్ముట్టి స్పందించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ‘పవర్ గ్రూప్’ ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు.
జస్టిస్ హేమ కమిటీని నియమించిన ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసిస్తూ కమిటీ చేసిన సిఫార్సులు, చూపిన పరిష్కారాలకు తాను మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తున్నానని తెలిపారు.
హేమ కమిటీ గురించి
తెలియదు: రజనీకాంత్ కేరళ ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిటీ గురించి, అలాంటి కమిటీ యే తమిళనాడులో ఏర్పాటు చే యాలన్న డిమాండ్ గురించి తనకు తెలియదని సూపర్‌స్టార్ రజనీకాంత్ తెలిపారు.