Venus | అత్యంత ప్రకాశవంతంగా శుక్రుడు.. సాయంత్రం వేళల్లో నేరుగా చూడొచ్చు
Venus | భూమికి అతి సమీపంలో ఉండే శుక్రగ్రహం ఇప్పుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఒక వజ్రంలా మెరుస్తూ కనిపిస్తున్నది.
Venus | న్యూఢిల్లీ, జూన్ 7: భూమికి అతి సమీపంలో ఉండే శుక్రగ్రహం ఇప్పుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా ఒక వజ్రంలా మెరుస్తూ కనిపిస్తున్నది. సాయంత్రం వేళ సూర్యాస్తమయం తర్వాత దీనిని భూమి మీద నుంచి నేరుగా గమనించవచ్చు. సాధారణంగా శుక్రగ్రహం సూర్యుని మీదుగా లేదా కిందగా వెళ్లినప్పుడు సూర్యకాంతి దాని వాతావరణాన్ని ప్రతిబింబించి ప్రకాశవంతంగా మారుతుంది.
ఇప్పుడు శుక్రగ్రహం ఇదే స్థితిలో ఉన్నందున ఎక్కువ సూర్యరశ్మిని పొందుతూ, ప్రకాశవంతంగా మారిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పైగా సూర్యుని చుట్టూ దాని కక్ష్యలో తిరుగుతున్న శుక్రగ్రహం ఇప్పుడు సరిగ్గా భూమికి, సూర్యడికి దాదాపుగా మధ్యకు వచ్చింది. దీంతో శుక్రగ్రహాన్ని నేరుగా భూమి నుంచి వీక్షించేందుకు ఇది సరైన సమయమని, పశ్చిమ దిశగా రాత్రి 7.30 నుంచి 9.45 వరకు ఆకాశంలో మెరిసే శుక్రుడిని చూడవచ్చని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Earth
- Scientists
- sun rays
- Venus
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

