BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
BRS Denmark | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డెన్మార్క్ అధ్యక్షుడు శ్యామ్‌బాబు డిమాండ్ చేశారు.
డెన్మార్క్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక వెంటనే క్షమాపణ ( Apologize ) చెప్పాలని బీఆర్ఎస్ డెన్మార్క్ ( BRS Denmark ) అధ్యక్షుడు శ్యామ్‌బాబు ( Shyam Babu ) డిమాండ్ చేశారు.
తెలంగాణ సాగునీటి రంగంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతాంగానికి ఎంతో కీలకమైనవని వెల్లడించారు. అలాంటి ప్రాజెక్టులపై ప్రజల్లో అపోహలు సృష్టించే ఉద్దేశంతో ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వార్తలు ప్రచురించే ముందు సంబంధిత అధికారిక రికార్డులను పరిశీలించి, వాస్తవాలను ధ్రువీకరించి, సంబంధిత అధికారుల వివరణ తీసుకోవడం పత్రికల బాధ్యత అని స్పష్టం చేశారు.
రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కును, పత్రికా స్వేచ్ఛను బీఆర్ఎస్ గౌరవిస్తుందని, అయితే ఆ స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు చేయడం, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచురించిన ఈ కథనాన్ని వెలుగు పత్రిక వెంటనే ఉపసంహరించుకోవాలని, కథనంలోని ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను వెల్లడించాలని కోరారు .
కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సైతం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తప్పుడు ప్రచారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

