హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ‘ఇన్టాక్’ సంస్థ పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ పర్యావరణవేత్త, హెరిటేజ్ కార్యకర్త మణికొండ వేదకుమార్ మరోసారి ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో వరుసగా మూడోసారి అత్యధిక మెజారిటీతో గెలిచారు. దేశ చారిత్రక సంపదను కాపాడేందుకు మూడు దశాబ్దాల నుంచి విశేష కృషిచేస్తున్న వేదకుమార్.. 2016, 2019లో రెండుసార్లు ఇన్టాక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గా ఎన్నికయ్యారు. 2001 నుంచి ఇన్టాక్తో అనుబంధం కలిగివున్న వేదకుమార్.. 2012 నుంచి 2014 వరకు ఏపీ రాష్ట్ర శాఖకు కో-కన్వీనర్‌గా కొనసాగారు.