Good News : త్వరలో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఉచితం!
Good News : త్వరలో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఉచితం! | దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ కార్యక్రమం వేగంగా సాగుతున్నది. ప్రస్తుతం టీకా కేంద్రాల్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టీకాలను కేంద్రం తయారీ సంస్థలను సేకరించి ఉచితంగా రాష్ట్రాలకు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ కార్యక్రమం వేగంగా సాగుతున్నది. ప్రస్తుతం టీకా కేంద్రాల్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టీకాలను కేంద్రం తయారీ సంస్థలను సేకరించి ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. త్వరలో రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సైతం ప్రభుత్వ ఆధ్వర్యంలో సాగుతున్న టీకా కేంద్రాల్లోనూ ఉచితంగా వేయనున్నారు. ఈ విషయాన్ని కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ప్రెసెడింట్ డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. ప్రస్తుతం స్పుత్నిక్ వ్యాక్సిన్ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రష్యా వ్యాక్సిన్‌ను సైతం ఉచితంగా అందుబాటులో ఉంచాలని మేం కోరుకుంటున్నామని, అయితే టీకా సరఫరాపై ఆధారపడి ఉంటుందన్నారు.
వ్యాక్సిన్‌ను మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుందని, పోలియో వ్యాక్సిన్ కోల్డ్ చైన్ సదుపాయాలను స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ నిల్వ చేసేందుకు వినియోగిస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో టీకాల పంపిణీలో స్పీడ్ తగ్గిందన్నారు. కార్యక్రమం రాబోయే వారం క్రమబద్ధీకరించనున్నట్లు చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో జూలై చివరి నాటికి సుమారు 50 కోట్ల మోతాదులు పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘రోజుకు కోటి టీకాల లక్ష్యం’పై స్పందిస్తూ.. టీకా సరఫరాలో ప్రధాన భాగం కొవిషీల్డ్, కొవాగ్జిన్దేనని తెలిపారు. రెండు వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచడంతో పాటు స్పుత్నిక్ వీ, మోడెర్నా, జైడస్ క్యాడిలా కొత్త టీకాలతో.. రోజువారీ టీకాల పంపిణీని 8 నుంచి 10 మిలియన్లకు పెంచవచ్చన్నారు.
థర్డ్ వేవ్.. డెల్టా ప్లస్ వేరియంట్ నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి (సుమారు 93కోట్లు మంది) టీకాలు వేయాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నాటికి థర్డ్ వచ్చే అవకాశం ఉందని అరోరా పేర్కొన్నారు. ఈ క్రమంలో డెల్టా వేరియంట్లకు వ్యతిరేకంగా టీకాలు వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు దేశంలో 52 వరకు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
Good News : భారత్ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసిన జర్మనీ
ఘోరం : రెండు ట్రక్కుల ఢీ.. డ్రైవర్ మృతి
హర్యానాలో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు
కుమ్రంభీంలో దారుణం.. మామను హత్య చేసిన అల్లుడు
నేడు కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్‌తో ప్రధాని భేటీ
దేశంలో కొత్తగా 34వేల కరోనా కేసులు..
వినాయక చవితికి ప్రత్యేక రైళ్లు
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
మహబూబ్‌నగర్ : బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం
రూ.40వేల కోట్లతో ఇంటింటికీ మంచినీళ్లు : మంత్రి ఎర్రబెల్లి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

