డెహ్రాడూన్: ఈ మధ్యే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తీరథ్ సింగ్ రావత్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. తనను కొద్ది రోజులుగా కలుస్తున్న వాళ్లంతా కూడా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
Uttarakhand CM Tirath Singh Rawat tweets that he has tested positive for #COVID19. pic.twitter.com/sAuP4anELx
— ANI (@ANI) March 22, 2021