Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీలీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా పలు రికార్డులను సృష్టించేలా దూసుకెళ్తోంది. ఇటీవల ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికాలోని నార్త్ అమెరికా ప్రాంతంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభం కాగా, కొన్ని గంటల్లోనే ఈ సినిమా 50 వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం.
ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌కు విదేశాల్లో ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా, రాబోయే రోజుల్లో బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సినిమా కంటెంట్ బలంగా ఉంటే, నార్త్ అమెరికా మార్కెట్లో భారీ వసూళ్లు సాధించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదలకు ముందే ఓవర్సీస్లో మంచి బిజినెస్ సాధించడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓజీ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న ఈ సినిమా ప్రభంజనాలు సృష్టించడం ఖాయం అని అంటున్నారు.