హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కెప్టెన్ మెనాంక్ పటేల్, సౌరభ్ నేత్రావల్కర్, మిలింద్కుమార్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితుల వేదాశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.