వాషింగ్టన్: ఒక మహిళ 14 ఏండ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడింది. కొంత కాలంగా అతడితో శృంగారంలో పాల్గొన్న ఆమె రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఆ బాలుడి ద్వారా గర్భం దాల్చింది. అమెరికాలోని ఆర్కాన్సాస్‌లో ఈ ఘటన జరిగింది. బ్రిట్నీ గ్రే అనే మహిళ ఏడాదిగా 14 ఏండ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడింది. గత ఏడాది సెప్టెంబర్‌లో దీనిని ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి, పిల్లల హాట్‌లైన్‌కు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ బాలుడితో శృంగారం ద్వారా బ్రిట్నీ గ్రే గర్భం దాల్చినట్లు ఆ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపాడు. పోలీసులు కూడా ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. ఈ నెల 1న గ్రేను అరెస్ట్ చేశారు. ఆమె 5 వేల డాలర్ల బాండు సమర్పించడంతో గురువారం విడుదల చేశారు. ఏప్రిల్ 23న కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతుందని, అప్పుడు ఆమె హాజరుకావాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.