ఇరాన్ పై మళ్లీ దాడులకు అమెరికా సన్నాహాలు!
అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ థియోడార్ రూజ్వెల్ట్ ఆదివారం పశ్చిమాసియాలో ప్రవేశించింది.
- పశ్చిమాసియాకు మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్
వాషింగ్టన్: అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ థియోడార్ రూజ్వెల్ట్ ఆదివారం పశ్చిమాసియాలో ప్రవేశించింది. దీంతో ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన విమానవాహక నౌకల సంఖ్య మూడుకు పెరిగింది. ఇరాన్‌తో ఉద్రిక్తతలు ఇంకా పరిష్కారం కాకపోవడం, ఆ దేశంతో మరో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్దగా ఆసక్తి చూపకపోవడం నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది.
రూజ్వెల్ట్లో క్యారియర్ ఎయిర్ వింగ్ 11, యూఎస్ ఎస్ చోసిన్ క్రూయిజర్, యూఎస్ ఎస్ పాల్ హామిల్టన్, యూఎస్ ఎస్ డికేచర్ అనే రెండు డిస్ట్రాయర్లు ఉన్నాయి. 5,000 మందికిపైగా సైనిక సిబ్బంది ఉన్నారు. బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక వనరులపై, ముందస్తు హెచ్చరిక రాడార్ వ్యవస్థపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించగా, రాడార్ దెబ్బతినలేదని అమెరికా తెలిపింది. బహ్రెయిన్ వైపు వస్తున్న రెండు ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నామని పేర్కొంది.
ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకుంటాం
ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న తమ దేశంలోని మినాబ్‌లో ఉన్న ఒక పాఠశాలపై దాడి చేసి 168 మంది చిన్నారుల మృతికి ఇద్దరు అమెరికా నేవీ అధికారులు కారణమయ్యారని ఇరాన్ ఆరోపించింది. ‘ఎక్కడున్నా మిమ్మల్ని కనుగొంటాం’ అంటూ వారిని హెచ్చరించింది. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్‌లో సోమవారం ఈ మేరకు పాత ట్వీట్ ను రీట్వీట్ చేసింది. ఆ ఇద్దరు అధికారులను ‘నేరస్తులు’గా పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

