లక్నో: యూపీలో క్రీడాకారుల పరిస్థితి దారుణంగా ఉంది. షహరాన్పూర్లోని ఓ స్టేడియంలో కబడ్డీ ఆటగాళ్లకు.. ఆ స్టేడియం బాత్రూమ్ల వద్దే భోజనం పెట్టారు. అండర్-17 కబడ్డీ ప్లేయర్లకు ఈ చేదు ఘటన ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రీడాకారులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆ వీడియోలను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. స్టేడియంలో ఉన్న పురుషుల టాయిలెట్ల వద్ద ప్లేయర్లకు భోజనం సరఫరా చేశారు. టాయిలెట్ల వద్ద ఓ భారీ ప్లేట్లో అన్నం పెట్టి, సుమారు 200 మంది ప్లేయర్లకు ఆ అన్నాన్ని సర్వ్ చేశారు. అండర్-17 గర్ల్స్ కబడ్డీ టోర్నీలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో జిల్లా క్రీడా అధికారి అనిమేశ్ సక్సేనా సస్పెన్షన్కు గురయ్యారు. వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.