Ravi Teja | వృత్తి పరంగా పోటీ ఉన్నా.. వ్యక్తిగతంగా హీరోలంతా స్నేహంగానే ఉంటారని పలు సందర్భాల్లో రుజువైంది కూడా. బాలకృష్ణ, రవితేజలపై గతంలో చాలా రూమర్లు వినిపించాయి. అవన్నీ అబద్ధాలని ‘అన్‌స్టాపబుల్’ వేదికగా బాలయ్య, రవితేజ తేల్చేశారు. రీసెంట్గా బాలకృష్ణ ‘డాకూ మహారాజ్’ చిత్రానికి రవితేజ వాయిస్ఓవర్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమాలో కొన్ని చోట్ల బాలకృష్ణ పాత్ర తీరు తెన్నుల్ని, గొప్పతనాన్ని ఎలివేట్ చేస్తూ వాయిస్ఓవర్ వస్తుందట.
ఆ వాయిస్‌ని రవితేజ అందించారని విశ్వసనీయ సమాచారం. రవితేజ వాయిస్ఓవర్ తప్పకుండా సినిమాపై బలమైన ప్రభావమే చూపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా.. ‘డాకూ మహారాజ్’కి మాస్ మహారాజ్ వాయిస్ఓవర్ ఇవ్వడం నిజమే అయితే.. అది అభిమానులకు నిజంగా గుడ్ న్యూసే.