స్వదేశీ ఉగ్రవాదం పూర్తిగా అంతరించిపోలేదు
దేశం గత 50 ఏండ్లుగా వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, స్వదేశీ, విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ చెప్పారు.
- కేంద్ర హోంశాఖ కార్యదర్శి వెల్లడి
- ఘనంగా ఐపీఎస్ల దీక్షాంత్ పరేడ్
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): దేశం గత 50 ఏండ్లుగా వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు, స్వదేశీ, విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ చెప్పారు. శనివారం హైదరాబాద్లోని జాతీయ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 78వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల దీక్షాంత్ పరేడ్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడా రు.
దేశంలో మావోయిజం ముగింపు దశకు చేరుకున్నదని, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాట్లు తగ్గినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం సమస్య ఉన్నదని వెల్లడించారు. జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్ సుజిత్పాండే మాట్లాడుతూ 78వ బ్యాచ్లో 151 మంది ట్రైనీలు ఉండగా, వారిలో 135 మంది ఐపీఎస్, 16 మంది పొరుగు దేశాలకు చెందిన అధికారులు ఉన్నారని, వారికి 45 వారాల పాటు కఠోర శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

