TVK CM candidate : తమిళిగ వెట్రి కళగం పార్టీ (TVK party) ముఖ్యమంత్రి అభ్యర్థి (CM candidate) గా ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ (Actor Vijay) పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం తమిళనాడు (Tamil Nadu) రాజధాని చెన్నై (Chennai) లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ‘టీవీకే స్పెషల్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ (TVK special general council meeting)’ లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తీర్మానం కూడా చేశారు.
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ సమక్షంలో ఈ సమావేశం జరిగింది. కాగా తమిళనాడులో గత కొన్ని దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తోంది. ముఖ్యంగా అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీల మధ్యనే తరచూ అధికారం చేతులు మారుతూ వస్తున్నది. జాతీయస్థాయిలో ప్రధాన పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లకు తమిళనాడులో పెద్ద ప్రాధాన్యం లేదు. ఈ క్రమంలో విజయ్ సొంతంగా పార్టీ పెట్టి.. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.