కీవ్: రష్యా దూకుడును ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. అయితే భారీ రష్యా కాన్వాయ్‌కు జలక్ ఇచ్చిన ఉక్రెయిన్ సైనికులు ఇప్పుడు పాటలు పాడుకుంటున్నారు. లక్షలాది మంది రష్యా సైనికుల్ని ముప్పుతిప్పలు పెట్టిన బైరక్తార్ డ్రోన్లపై.. ఉక్రెయిన్ జవాన్లు పాటలతో ప్రశంసలు కురిపిస్తున్నారు. బైరక్తార్ డ్రోన్లను టర్కీలోని ఇస్తాంబుల్‌లో తయారు చేస్తున్నారు. బైరక్తార్ టీబీ2 డ్రోన్లు ఒకరకంగా రష్యాకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. రష్యా సైనిక కాన్వాయ్‌ను ఛిన్నాభిన్నం చేసింది ఈ డ్రోన్లే. బైరక్తార్ డ్రోన్ల వల్లే రష్యా దూకుడును ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఆ డ్రోన్ల పట్ల ముగ్దులైన ఉక్రెయిన్ దళాలు వాటి గురించి పాటలతో ప్రచారం చేస్తున్నారు.
బైరక్తార్ డ్రోన్ల గురించి తెలుసుకున్న అమెరికా ఇప్పుడు ఆ డ్రోన్లకు లేజర్ గైడెడ్ రాకెట్లను కూడా అమర్చనున్నది. ఉక్రెయిన్ దళాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో లేజర్ గైడెడ్ రాకెట్ సిస్టమ్‌ను జోడించాలని భావిస్తున్నారు. నిజానికి గైడెడ్ సిస్టమ్ ఉన్న రాకెట్‌ను మిస్సైల్ అంటారు. అయితే ఉక్రెయిన్ దళాలకు టీబీ2 డ్రోన్లు ఎంతో సహకరించినట్లు తెలుస్తోంది. రష్యా సైనిక సామర్థ్యాన్ని ఈ మిస్సైళ్లు ఈజీగా ఎదుర్కొన్నట్లు స్పష్టం అవుతోంది.
ఉక్రెయిన్ గెరిల్లా దళాలు ఎక్కువ శాతం టర్కీకి చెందిన బైరక్తార్ డ్రోన్లను వాడాయి. ప్రతి రోజు ఆ డ్రోన్ల గురించి సోసల్ మీడియాలో విసృత ప్రచారం జరుగుతోంది. బైరక్తార్ డ్రోన్లకు చెందిన వీడియోలను కూడా పోస్టు చేశారు.
The video you didn't know you needed:#Ukraine's military orchestra performing the song "Bayraktar" (named after the Turkish-made drone) pic.twitter.com/s2c8xlSNxQ
— Michael A. Horowitz (@michaelh992) April 4, 2022