Tumbbad Director | ‘తుంబాడ్’ వంటి కల్ట్ క్లాసిక్‌ను అందించిన దర్శకుడు రాహి అనిల్ బార్వే నుంచి మరో సంచలనం రాబోతోంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘మయసభ’ (Mayasabha – The Hall of Illusion). ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేసింది చిత్రయూనిట్. ‘తుంబాడ్’ తరహాలోనే ఈ సినిమాలో కూడా ఒక విభిన్నమైన ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్న జావేద్ జాఫ్రీ (Jaaved Jaaferi) గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక కొత్త అవతారంలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. వీణా జమ్కర్, దీపక్ దామ్లే, మొహమ్మద్ సమద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.