భారీగా టక్ జగదీష్ ప్రీ రిలీజ్ బిజినెస్..

తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది హీరోలకు హిట్లు ప్లాపులతో సంబంధం ఉండదు. బిజినెస్ పరంగా వాళ్ళ సినిమాలకు డోకా ఉండదు. అలాంటి అరుదైన ఇమేజ్ సంపాదించుకున్న నటుడు నాని. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు ఇండస్ట్రీలో సెకండ్ టైర్ హీరోల్లో నెంబర్ వన్ గా ఉన్నాడు. ఆయన సినిమాకు కనీసం 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం ఆనవాయితీగా మారిపోయింది. నానితో సినిమా చేస్తే మేం సేఫ్ అనే నమ్మకం నిర్మాతలలో కలిగించాడు నాచురల్ స్టార్. ప్రస్తుతం ఈయన నటిస్తున్న టక్ జగదీష్ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
నిన్ను కోరి, మజిలీ లాంటి సూపర్ హిట్స్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు బిజినెస్ కు కూడా రెక్కలు వచ్చాయి. నాని గత సినిమాలు వి, గ్యాంగ్ లీడర్ అంచనాలు అందుకోలేకపోయాయి. దాంతో ఈయన ఆశలన్ని టక్ జగదీష్ సినిమాపైనే ఉన్నాయి. అయితే నాని ఫ్లాపులు ఈ సినిమా బిజినెస్ పై ఏ మాత్రం ప్రభావం చూపించడం లేదు.
ఈ సినిమా కోసం భారీ అమౌంట్ కోట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఆంధ్ర, నైజాం, సీడెడ్ అనే తేడా లేకుండా అన్నిచోట్ల టక్ జగదీష్ సినిమా కోసం ఎగబడుతున్నారు బయ్యర్లు. శివ నిర్వాణ ట్రాక్ రికార్డ్.. నాని ఇమేజ్ రెండు కలిపి టక్ జగదీష్ సినిమాను 35 కోట్ల బిజినెస్ వైపు పరుగులు పెట్టేలా చేస్తుంది. ఏప్రిల్ 23న ఈ సినిమా విడుదల కానుంది. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే నాని సినిమాకు ఇది పెద్ద టార్గెట్ కాదు. మరి చూడాలి టక్ జగదీష్ ఏం చేస్తాడో..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

