టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో ఇకపై ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు నో ఎంట్రీ!

తిరుమల, జూలై: ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకున్నది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈవో ఏ.వీ.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..”తిరుమల పవిత్రతను, స్వచ్ఛతను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని, భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తీసుకురావద్దని”విజ్ఞప్తి చేశారు
“తిరుమలకు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు చేరకుండా అలిపిరి చెక్పాయింట్ వద్ద తనిఖీలు చేసి వాటిని తొలగిస్తామని” ఏ.వీ.ధర్మారెడ్డి అన్నారు. “తిరుమలలోని దుకాణాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను విక్రయించకూడదని ఆయన పేర్కొన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా గాజు, కాపర్, స్టీల్ వాటర్ బాటిళ్లు భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరారు. 2 నెలల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధానికి తిరుమల స్థానికులు, వ్యాపారులు సహకరించాలన్నారు. భక్తుల అవసరాల కోసం అన్ని కాటేజీల్లో జలప్రసాదం తాగునీరు, జగ్గులు, గ్లాసులు ఏర్పాటు చేశామని” ఏ.వీ.ధర్మారెడ్డి తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

