నేర పరిశోధనలో తెలంగాణ పోలీసులు బెస్ట్

హైదరాబాద్ : నేర పరిశోధనలో తెలంగాణ పోలీసులు బెస్ట్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. పోలీసు శాఖ పద్దులపై శాసనసభలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడారు. ప్రపంచ చిత్ర పటంలోనే తెలంగాణ పోలీసులకు మంచి గుర్తింపు వచ్చింది. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. దీంతో పెట్టుబడులు వెల్లువలా తరలివస్తున్నాయి. అత్యున్నత జీవన ప్రమాణాలను నెలకొల్పుతున్నామని తెలిపారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు రాష్ర్ట పోలీసు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది. తెలంగాణ పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ఒకప్పుడు పోలీసులంటేనే ప్రజలు భయపడేవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులకు ప్రజలపై నమ్మకం పెరిగిందన్నారు.
నేరాలను నియంత్రించేందుకు రాష్ర్ట వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కెమెరాల ఏర్పాటుతో నేరాలను పూర్తిగా అరికట్టగలిగామని తెలిపారు. కిడ్నాప్ కేసులను 24 గంటల్లోనే ఛేదిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. రాష్ర్టంలో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ప్రపంచంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేక స్థానముంది. నేర పరిశోధనలో స్కాట్లాండ్, ముంబై పోలీసులను తెలంగాణ పోలీసులు అధిగమించారు. కరోనా సమయంలో పోలీసుల సేవలు మరిచిపోలేనివి అని పేర్కొన్నారు. నిరాశ్రయులను చేరదీసి వారి సొంతూర్లకు పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. వామన్‌రావు దంపతుల హత్య కేసును పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ కేసును హైకోర్టు మానిటరింగ్ చేస్తుందని ఎమ్మెల్యే క్రాంతి తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

