Huzurabad | బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్

హైదరాబాద్ / హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీ ప్రధానకార్యదర్శి సోమ భరత్‌కుమార్ పలు కేసులపై ఆధారాలతో పాటు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అసత్య ఆరోపణలు, తీవ్ర నేరారోపణతో కూడిన కేసులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ , ఆ పార్టీ నాయకులు ఇరికించే ప్రయత్నం చేశారని ఎన్నికల కమిషన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్థి దుష్ప్రచారం చేస్తూ లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పాటు, టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నేత జగన్ పై బీజేపీ నేతలు దాడి చేయడాన్ని కూడా ఆ ఫిర్యాదులో పొందుపరిచారు.
అలాగే హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ రోడ్ షోలు నిర్వహిస్తున్నా రని, టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుందని దుష్ప్రచారం చేయడంతో పాటు, డబ్బులు తీసుకోమని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లును తప్పుదోవ పట్టించడం, టీఆర్ఎస్ మీద తప్పుడు ప్రచారం చేయడంపైన కూడా ఎన్నికల కమిషన్ కు తెలంగాణ రాష్ట్రసమితి ఫిర్యాదు చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

