న్యూఢిల్లీ : టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ హైబ్రిడ్ ఎస్యూవీ ఈ ఏడాది ఆగస్ట్‌లో లాంఛ్ కానుండగా బుకింగ్స్‌ను కంపెనీ షురూ చేసింది. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ హైబ్రిడ్ ఎస్యూవీ మార్కెట్లోకి ఎంటరైతే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజీ ఆస్టర్, వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషక్ వంటి ఎస్‌యూవీలకు దీటైన పోటీ ఇస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
హైరైడర్ స్పోర్ట్స్ స్ల్పిట్ హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ సెటప్‌ను కలిగిఉంది. ఈ ఎస్యూవీ ఎల్ఈడీ లైటింగ్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ సిగ్నేచర్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. టయోటా న్యూ ఎస్‌యూవీలో 17 ఇంచ్ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్‌తో ముందుకురానుంది.
టయోటా హైరైడర్ ఎస్యూవీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, 9 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ చార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడప్ డిస్ప్లే, రియర్ ఎయిర్కాన్ వెంట్, రీసైక్లింగ్ రియర్ సీట్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం వంటి హాట్ ఫీచర్లను కలిగిఉంది. వీటితో పాటు 360 డిగ్రీ కెమెరా వ్యూ, పానరామిక్ సన్‌రూఫ్ వంటి స్పెసిఫికేషన్స్ ఆకట్టుకోనున్నాయి. ఇక టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ హైబ్రిడ్ ఎస్యూవీ ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.