Toxic Teaser | కన్నడ రాకింగ్ స్టార్ యష్ అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. యష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-వరల్డ్ మూవీ ‘టాక్సిక్’ (Toxic: A Fairy Tale for Grown-Ups) నుంచి టీజర్‌ను మేకర్స్ నేడు విడుదల చేశారు. కేజీఎఫ్ తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్న యష్ ఈ టీజర్‌తో బాక్సాఫీస్ వద్ద మరో సునామీ సృష్టించడం ఖాయమని తెలుస్తుంది.
దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రారంభం నుంచే ప్రేక్షకులను ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఇందులో యష్ పాత్ర పేరు రాయ (Raya) అని తెలుస్తుంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా స్మశానవాటిక సెటప్‌లో యష్ కారుతో ఇచ్చే ఎంట్రీ సీన్ హైలైట్‌గా నిలిచింది. పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, నోట్లో సిగార్.. చేతిలో అత్యాధునిక గన్‌తో యష్ మునుపెన్నడూ లేనంత స్టైలిష్‌గా, క్రూరంగా కనిపిస్తున్నారు. టీజర్ చివరలో గన్‌తో ఫైర్ చేస్తూ యష్ చెప్పే “డాడీ ఈజ్ హోమ్” అనే డైలాగ్ థియేటర్లలో విజిల్స్ వేయించడం గ్యారెంటీ. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని కేవలం ఒక యాక్షన్ సినిమాగా కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక ‘డార్క్ ఫెయిరీ టేల్’గా తీర్చిదిద్దారు. రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రాణం పోసింది.
ఈ క్రేజీ ప్రాజెక్టులో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘టాక్సిక్’ చిత్రం మార్చి 19, 2026న తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.