తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ప్రాజెక్టు అన్నాత్తె. శివ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు జగపతిబాబు రజనీకాంత్‌తో ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. జగ్గూబాయ్ అన్నాత్తె టీంలో జాయిన్ అయినట్టు సన్ పిక్చర్స్ ట్వీట్ ద్వారా తెలిపింది. క థానాయకుడు, లింగా చిత్రాల ద్వారా రజనీ-జగపతిబాబు కాంబినేషన్లో ఇది మూడో సినిమా.
జగ్గూబాయ్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే చెన్నైలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటికే రామోజీఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంది అయితే రజనీకాంత్ ఒత్తిడి లోను కావొద్దని, విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించిన నేపథ్యంలో షూటింగ్‌కు బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే. నయనతార, కీర్తిసురేశ్, మీనా, ఖుష్బూ కీ రోల్స్ చేస్తున్నారు. డి ఇమ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్. దీపావళి కానుకంగా నవంబర్ 4న అన్నాత్తె విడుదల కానుంది.
.@IamJagguBhai joins the cast of #Annaatthe.@rajinikanth @directorsiva @immancomposer #Nayanthara @KeerthyOfficial pic.twitter.com/k9ZHVLUNNx
— Sun Pictures (@sunpictures) March 16, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.