‘రాజా విక్రమార్క’ వేడుకలో తనకు కాబోయే భార్య లోహితను అభిమానులకు పరిచయం చేశారు హీరోకార్తికేయ. తన ప్రేమకథ గురించి వేదికపై చెప్పారు. ‘లోహితకు తొలుత నేనే ప్రపోజ్ చేశా. నా జీవితంలో హీరోగా నిలదొక్కుకోవడానికి పడినంత స్ట్రగుల్ ఆమె ప్రేమ కోసం పడ్డాను. లోహితకు నా ప్రేమను వ్యక్తం చేసిన రోజే హీరో అవుదామనుకుంటున్న విషయాన్ని తనకు చెప్పా. హీరో అయిన తర్వాతే మీ ఇంటికి వచ్చి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెబుతానని అన్నా. లోహిత, నేను ఈ నెల 21న పెళ్లిచేసుకోబోతున్నాం. నా బెస్ట్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ నుంచి భార్యగా నా జీవితంలోకి ఆమె ప్రవేశించబోతున్నది’ అని కార్తికేయ తెలిపారు.