హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ టెన్నిస్ ప్లేయర్ యడ్లపల్లి ప్రాంజల ఐటీఎఫ్ టైటిల్ కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా కర్ణాటక రాష్ట్ర లాన్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీ మహిళల సింగిల్స్‌లో ప్రాంజల విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో ప్రాంజల 7-5, 6-2తో సౌజన్య భవిశెట్టిపై విజయం సాధించింది.