శ్రీశైల క్షేత్రం సమీపంలో ఆదివారం రాత్రి పెద్దపులి సంచారం కలకలం రేపింది. క్షేత్ర ముఖద్వారం వద్ద ప్రయాణికుల వాహనాల సమీపంలోకి వచ్చిన పెద్దపులి.. అక్కడే చెట్లపొదల్లో కొంతసేపు నిల్చుంది. తర్వాత వేగంగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. పెద్దపులి సంచారంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.