పండ్లు అమ్మే వ్యక్తి హత్య కేసులో ముగ్గురు అరెస్టు

హైదరాబాద్ : పండ్ల దుకాణంలో పనిచేసే వ్యక్తి హత్య కేసులో నగరంలోని రాచకొండ పోలీసులు ఆదివారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు పి. సందీప్ రెడ్డి(28), పి. ఉదయ్ కిరణ్ రెడ్డి, ఏ. శ్రీకాంత్ రెడ్డి. హయత్‌నగర్ చోటుచేసుకున్న ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సందీప్ రెడ్డి పండ్ల దుకాణం యజమాని సుభాష్ వద్ద రూ. 720 అప్పు చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా అడగడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో సుభాష్.. సందీప్ బైక్ తాళాలు, మొబైల్ ఫోన్ లాక్కొని డబ్బులు ఇచ్చి వాటిని తీసుకువెళ్లాల్సిందిగా తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుడైన సందీప్ తన స్నేహితులిరువురిని పిలిచి దుకాణ యజమాని సుభాష్ అందులో పనిచేసే మధుసూధన్‌రెడ్డి(45)పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధుసూధన్‌రెడ్డి చనిపోయాడు. దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

