సీఎం కేసీఆర్ వంటి నాయకుడు చరిత్రలో లేరు

నాగర్‌కర్నూల్ : సీఎం కేసీఆర్ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
. ఉద్యమంలో వెనకడుగు వేస్తే రాళ్లతో కొట్టి చంపండని ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు చరిత్రలో లేరని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సకల జనుల సమ్మెలో విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులంతా సీఎం కేసీఆర్ వెంట నడిచి తెలంగాణ సాధించుకున్నారు
. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, గురుకులాలు ఏర్పాటు వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
కేంద్ర మంత్రులే ఈ పథకాలను ప్రశంసిస్తున్నారని మంత్రి తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటివి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. వాట్సప్, ఫేస్ బుక్కుల్లో అపనమ్మకాలను ప్రచారం చేస్తున్నారు
. అలాంటివి నమ్మొద్దన్నారు. ఉద్యోగులకు త్వరలో మంచి పీఆర్సీ వస్తుందని మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతురాలు
వాణిదేవి సీరియల్ నెంబర్ 4కు 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పద్మావతి, ఎంఎల్సీ దామోదర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

