జూబ్లీహిల్స్, నవంబర్ 14: అవగాహనతో వంధ్యత్వ సమస్యను అధిగమించాల్సిన అవసరం ఉందని ఒయాసిస్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వి.కీర్తన తెలిపారు. టోలిచౌకిలోని ఒయాసిస్ ఫెర్టిలిటీలో ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందిన మాతృమూర్తులను మంగళవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంలో 28 మిలియన్లకు పైగా దంపతులు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారన్నారు.
వీరిలో 3 శాతం మంది మాత్రమే సంతానోత్పత్తిపై ఆసక్తి కనబరచడం విచారకరమన్నారు. అపోహలను వీడి ఈ సమస్యను అధిగమించేందుకు సంతానోత్పత్తి నిపుణుల సహాయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఐవీఎఫ్‌లో గర్భస్రావాల ప్రమాదాలను తగ్గించడంలో పీజీటీ (ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్) ఒక అధునాతన సాంకేతికత అన్నారు. స్త్రీ గర్భాశయంలోకి ఎస్ఈటీ (సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్) ఒక పిండం మాత్రమే బదిలీ చేస్తామన్నారు.
తద్వారా బహుళ గర్భాలు నిరోధించవచ్చన్నారు. దంపతులు ఒక సంవత్సరం తరువాత గర్భం దాల్చకపోతే సంతానోత్పత్తి నిపుణులను వెంటనే సంప్రదించాలన్నారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ సంతానోత్పత్తి చికిత్సలలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉత్తమ పద్ధతులు, ప్రోటోకాల్‌ను తీసుకురావడం ద్వారా భారతదేశంలో పునరుత్పత్తి సంరక్షణకు సరికొత్త నిర్వచనం ఇచ్చిందని తెలిపారు. 2009 ప్రారంభమైన ఒయాసిస్ ఫెర్టిలిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్ఘఢ్, ఒడిశా రాష్ర్టాలలో 33కు పైగా కేంద్రాలలో సేవలందిస్తుందని వెల్లడించారు.