మంచిర్యాల : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ(ABVP ) 44 వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ల ( Posters ) ను మంచిర్యాలలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపల్ ఐత శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా వ్యవస్థ ప్రముఖ చెట్టి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ లావుడ్య అనిల్ కుమార్ మాట్లాడుతూ ఏబీవీపీ 44 వ రాష్ట్ర మహాసభలు జనవరి 3,4,5 తేదీలలో శంషాబాద్ లో జరుగుతాయని తెలిపారు. ఈ మహాసభలకు త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా, అఖిలభారత సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్ విశిష్ట అతిథిగా , ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు జానా రెడ్డి , ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వెయ్యి మంది హాజరవుతారని వివరించారు.