హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు గచ్చిబౌలి శాట్ షూటింగ్ రేంజ్లో శనివారం మొదలయ్యాయి. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్ సంఘి తొలి షాట్ కాల్చి టోర్నీని ప్రారంభించారు. ఈ నెల 27 వరకు జరిగే ఈ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, పిస్టల్, ట్రాప్, స్కీట్ ఈవెంట్ల ఒలింపిక్, నాన్-ఒలింపిక్ విభాగాల్లో 1,500 మందికి పైగా షూటర్లు పోటీపడనున్నారు.
కనీస అర్హత స్కోరు సాధించిన షూటర్లు.. సౌత్ జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌తో పాటు జాతీయ షూటింగ్ టోర్నీలో రాష్ట్ర జట్టుకు ఎంపికవుతారు.