అదే నిజమైన సంతోషం
మనసుకు నచ్చింది చేసినప్పుడే నిజమైన సంతోషం కలుగుతుందని, తనకు డ్యాన్సులు చేసినప్పుడు అలాంటి అనుభూతికి లోనవుతానని అంటున్నది బాలీవుడ్ తార సాన్యా మల్హోత్రా. డ్యాన్సర్‌గా కార్యక్రమాలు చేస్తూ చిత్ర పరిశ్రమను ఆకర్షించింది సాన్యా. ఆ తర్వాత అమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా సూపర్‌హిట్ కావడంతో బాలీవుడ్ యువ తారల్లో ఒకరిగా మారిపోయింది సాన్యా. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’, ‘పటాకా’, ‘బదాయి హో’, ‘శకుంతలా దేవి’ లాంటి చిత్రాలతో నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన కొత్త సినిమా ‘లవ్ హాస్టల్’ తాజాగా విడుదలైంది. డ్యాన్స్ చేసినప్పుడు నా మనసు బాల్యానికి వెళ్తుంది. అప్పుడు నిజమైన సంతోషాన్ని అనుభవిస్తా. సినిమాల్లో బీట్ పాటలకు డ్యాన్సులు చేయాలని ఉంది. అలాంటి అవకాశం కోసం చూస్తున్నా. నేను నటిగా మారి పేరు తెచ్చుకున్నాక కూడా మా ఇంట్లో వాళ్లకు సినిమాల గురించి తెలియదు. మేము రోజుకు 13 గంటలు కష్టపడతాం. అమ్మకు ఆ విషయం తెలియదు. ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకోవచ్చు కదా అంటుంటుంది’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సాన్యా. ప్రస్తుతం సాన్యా తెలుగు సినిమా ‘హిట్’ హిందీ రీమేక్‌లో నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు హీరోగా నటించారు. టి సిరీస్‌తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

