The Revolutionaries | బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన విప్లవ వీరుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘ది రివాల్యూషనరీస్’. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గాన్ని కాకుండా, ఆయుధాలు పట్టి పోరాడిన యువ విప్లవకారుల నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కింది. సంజీవ్ సన్యాల్ రాసిన ప్రసిద్ధ పుస్తకం ఆధారంగా ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ ఫేమ్ ప్రముఖ దర్శకుడు నిఖిల్ అద్వానీ ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించారు.
ఇందులో భువన్ బామ్ (రాష్ బిహారీ బోస్), రోహిత్ సరాఫ్ (సచింద్ర నాథ్ సన్యాల్), ప్రతిభా రంతా (ప్రతిభా లాహిరి), గుర్ఫతే పిర్జాదా (బాఘా జతిన్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఉత్కంఠభరిత పోరాట ఘట్టాలతో సాగిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది.