న్యూఢిల్లీ, మార్చి 23: కనీస మద్దతు ధరల చట్టం కోసం కేంద్రప్రభుత్వంపై యుద్ధానికి రైతులు మళ్లీ సిద్ధం అవుతున్నారు. దేశవ్యాప్త ఉద్యమం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందు కోసం ‘ఎంఎస్పీ గ్యారెంటీ కిసాన్ మోర్చా’ పేరుతో బుధవారం ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీ, స్వాభిమాని పక్ష నేత రాజు శెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. మద్దతు ధరల చట్టంపై వివిధ రాష్ర్టాలకు చెందిన రైతు నేతలు బుధవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. వచ్చే 6 నెలల్లో ప్రతీ జిల్లాలో పర్యటించాలని, ఎంఎస్పీపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. చట్టం కోసం ప్రతీ గ్రామసభలో తీర్మానం చేసేలా ఉద్యమాన్ని విస్తరించాలని ఈ నేతలు పేర్కొన్నారు.
‘తుక్డే తుక్డే గ్యాంగ్‌కు మద్దతిచ్చే వారికి ఇదే హెచ్చరిక. మీరు ఎంత మంది అఫ్జల్ గురులను పుట్టించినా.. మేం వారిని ఒక్కొక్కరిగా చంపేస్తాం. అఫ్జల్ ఉరికి వ్యతిరేకంగా 2016లో ఢిల్లీలోని జేఎన్‌యూలో ఆందోళనలు నిర్వహించిన దేశ వ్యతిరేక శక్తుల వెనుక ఆప్ ఉంది. మన దేశ ప్రజలు కడుతున్న పన్నులతో నడుస్తున్న జేఎన్‌యూ వంటి వర్సిటీలో ‘భారత్ ముక్కలు అవుతుంది’, ‘ఇన్షాల్లాహ్’ వంటి నినాదాలు చేశారు. మన దేశాన్ని విభజించాలని అనుకుంటున్నారు. అటువంటి వారికి ఆప్ నేతలు మద్దతిస్తున్నారు. నవ భారతంలో రాజ్య వ్యతిరేకులను వదలబోం’
– బీజేపీ నేత ప్రదీప్ సిన్హ్ వాఘేలా