ఖర్చు తగ్గించినా ఆదానే!
సంపాదించిన దాంట్లో ఎంతోకొంత పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. అయితే, నెలాఖరు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులవుతాయి. పోపులపెట్టెలో కూడబెట్టిన చిల్లర కూడా వెతుక్కోవాల్సి వస్తుంది.
సంపాదించిన దాంట్లో ఎంతోకొంత పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అందుకు తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. అయితే, నెలాఖరు వచ్చేసరికి అంచనాలన్నీ తలకిందులవుతాయి. పోపులపెట్టెలో కూడబెట్టిన చిల్లర కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితి తలెత్తొద్దు అంటే.. ఖర్చులను నియంత్రించడం ఒక్కటే మార్గం. ఖర్చులు తగ్గించడం కూడా సంపాదనే!
ముందుగా పక్కాగా ఉండే పద్దులు ఏమిటో లిస్ట్ చేసుకోవాలి. ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజు, పాలు, వెచ్చాలు, కరెంటుబిల్లు, ఫోన్ రీచార్జ్లు ఇలా నెలవారీ ఖర్చులు ఎంతో అంచనాకు రావాలి. వీటిలో తగ్గింపులు కుదరవు. ముందుగా వీటికి కేటాయించిన సొమ్మును వేతనం నుంచి పక్కన పెట్టాలి.
కూరగాయల దగ్గర బేషుగ్గా బేరమాడొచ్చు. ఏ పూటకు ఆ పూట కాయగూరలు తెచ్చుకుంటే.. లెక్కాపత్రం ఉండదు. సమయం కూడా వృథా! అలాకాకుండా వారానికి ఒకసారి రైతుబజార్కో, అంగడికో వెళ్తే కాస్త తక్కువ ధరకు కాయగూరలు దొరుకుతాయి. ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం కాబట్టి, డిమాండ్ చేసి మరీ ధరలు తగ్గించమనొచ్చు. కొసరు కూడా కొల్లగొట్టొచ్చు.
ప్రతి నెలా ఒకే బడ్జెట్ సూత్రాలు పాటిస్తానంటే కుదరదు. ఒక నెల పాపాయి పుట్టిన రోజు ఉండొచ్చు. మరోనెల అబ్బాయి ఇష్టపడే స్టార్ హీరో సినిమా విడుదల కావొచ్చు. వాటిని దృష్టిలో ఉంచుకొని నిధుల కేటాయింపు జరపాలి. బయటి ఫంక్షన్లు ఉంటే.. దగ్గరి బంధువులు అయితే తప్ప వెళ్లొద్దు.
పిల్లల పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏడాదీ ఘనంగా నిర్వహించాల్సిన అవసరం లేదు. కొత్త దుస్తులు కొనిచ్చి, స్కూల్లో చాక్లెట్లు పంచడం వరకే పరమితం చేయండి. బంధుగణాన్నంతా పిలిచి వేడుక చేస్తే.. ఖర్చులు తడిసి మోపెడవుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

