జీర్ణవ్యవస్థలో కాలేయమే కీలకం
దేశంలో శరవేగంగా పెరుగుతున్న కాలేయ సంబంధిత వ్యాధులను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో నియంత్రించవచ్చని యశోద వైద్య నిపుణులు పేర్కొన్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : దేశంలో శరవేగంగా పెరుగుతున్న కాలేయ సంబంధిత వ్యాధులను ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో నియంత్రించవచ్చని యశోద వైద్య నిపుణులు పేర్కొన్నారు. వరల్డ్ లివర్ డే సందర్భంగా కాలేయ ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని వైద్యులు సూచించారు. జీర్ణవ్యవస్థకు అనుబంధంగా ఉన్న అతిపెద్ద గ్రంధి అని, 500కుపైగా ప్రాణాధార విధులను నిర్వర్తిస్తుందని చెప్పారు. జీర్ణమైన ఆహారపదార్థాలు, కరిగిన మందులతో కూడిన రక్తాన్ని జాగ్రత్తగా వడబోసే క్రమంలో ఎన్నో ప్రమాదకర రసాయనాలను తొలగిస్తుందని తెలిపారు. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుందని, రక్తంలో చక్కెర వాతాన్ని క్రమబద్ధం చేస్తుందని చెప్పారు. సమతుల ఆహారం, వారంలో కనీసం ఐదు రోజులు 30 నిమిషాల వ్యాయామం, మద్య-ధూమపానానికి దూరంగా ఉండటం వలన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని యశోద హాస్పిటల్స్ సీనియర్ హెపటాలజిస్ట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ నిపుణులు డా. ధర్మేశ్ కపూర్ వివరించారు. వైరస్ కారణంగా సోకే హైపటైటిస్ వ్యాధి నియంత్రణకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఏటా కాలేయ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

