కథానాయిక తమన్నా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్-3’. వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా ఈ ఫన్ ప్రాంఛైజీని దర్శకుల్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మెహరిన్ మరో కథానాయిక. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తమన్నా పాత్ర గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘ఎఫ్-3లో కథని మలుపు తిప్పే పాత్రలో హారికగా తమన్నా కనిపించబోతుంది. చిత్ర కథ మొత్తం హారిక పాత్ర చుట్టే తిరుగుతుంది. వెంకటేష్-తమన్నాల మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా వుంటాయి. ‘మన ఆశలే మన విలువలు’ ఈ చిత్రంలో హారిక చెప్పే డైలాగ్ ఇది. తమన్నా కెరీర్లోనే హారిక పాత్ర ది బెస్ట్‌గా నిలవనుంది’ అన్నారు.