ఖమ్మం లీగల్, మార్చి 6 : ఖమ్మం జిల్లా కోర్టు పరిధిలోని పలువురు న్యాయవాదులు టీఆర్ఎస్ లీగల్ సెల్లో చేరారు. ఆదివారం స్వీకెల్ రిసార్ట్స్‌లో జరిగిన టీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హాజరయ్యారు. బిచ్చాల తిరుమలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు న్యాయవాదులు టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో కోనా చంద్రశేఖరగుప్తా, వేల్పుల సురేశ్, చంద్రావతి, సుధాకర్, ఐతగాని జనార్దన్, ఎల్.రాజశేఖర్, శివ సంతోశ్, టి.రమేశ్, ముచ్చర్ల నర్సింహారావు, కె.ప్రసాద్, త్రివేణి, సింగం జనార్దన్, దేవరకొండ కల్యాణి, ఎస్.లోక్‌శ్, సాయి భావన, పాషా, కె.జయరాజు ఉన్నారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి మంత్రి పువ్వాడ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలబడిందని అన్నారు. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు తెలిపారు. 8వ తేదీ అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. న్యాయవాదులు న్యాయం వైపు ఉండాలని, వాస్తవాలను సమాజానికి విప్పి చెప్పాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించిందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ న్యాయవాదులు కొత్త వెంకటేశ్వరరావు, పోట్ల శ్రీకాంత్, బెల్లం ప్రతాప్, హరీందర్‌రెడ్డి, రామారావు, పి.శ్రీనివాస్, హైమవతి, డి.కృష్ణారావు, మలీదు నాగేశ్వరరావు, మురళీధర్‌రావు, వాసుదేవ్, బసవపున్నయ్య, శ్రీకాంత్, మామిడి హనుమంతరావు, శేషుకుమార్ పాల్గొన్నారు.