హైదరాబాద్, జూన్ 29 (నమస్తేతెలంగాణ): అటవీశాఖలో సోమవారం పలువురు ఇండియన్ ఫారెస్ట్ అధికారుల(ఐఎఫ్ఎస్)కు ప్రభుత్వం ఉద్యోగోన్నతులు కల్పించింది. మరికొందరు జిల్లా ఫారెస్ట్ అధికారులను బదిలీచేసింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.
హనుమకొండ-జనగామ జిల్లా ఫారెస్ట్ అధికారిణిని మహబూబాబాద్‌కు, అక్కడ పనిచేస్తున్న అధికారిని వికారాబాద్ జిల్లా అటవీ అధికారిగా నియమించారు. వీరితోపాటు ఉద్యోగోన్నతులు పొందిన అధికారులకు పోస్టింగ్ కల్పించారు.
