విమల్, రవిఅశోక్, కీర్తిలత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘క్యాసెట్ గోవిందు’ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. కె.మణిధర్ నిర్మాత. విరాజ్వర్ధన్ దర్శకుడు. హీరోపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి వీరశంకర్క్లాప్నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇది. క్యాసెట్ గోవిందు జీవనగనమంలో ఎదురయ్యే సంఘటనలు కొత్త అనుభూతిని పంచుతాయి. సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’ అని తెలిపారు. ముగ్గురు స్నేహితులం కలిసి చేస్తున్న ఈ కొత్త ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని విమల్ చెప్పారు.