Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
Rahul Gandhi | కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి నవంబర్ 1న రామ్‌లీలా మైదానం (Ramlila Maidan) వరకు ర్యాలీ నిర్వహించతలపెట్టింది. అయితే ఈ ర్యాలీపై అధికార కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు.
Rahul Gandhi : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి నవంబర్ 1న రామ్‌లీలా మైదానం (Ramlila Maidan) వరకు ర్యాలీ నిర్వహించతలపెట్టింది. అయితే ఈ ర్యాలీపై అధికార కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ర్యాలీకి ప్రతిపక్ష కూటమి నేతలకంటే ఎక్కువగా బీజేపీ (BJP), దాని మిత్రపక్షాల నేతలే ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత (Congress Top Leader) రాహుల్‌గాంధీ (Rahul Gandhi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తమ ర్యాలీకి ఇంత ఉత్సాహంతో పెద్దఎత్తున పబ్లిసిటీ చేస్తున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల నేతలకు కృతజ్ఞతలు రాహుల్‌గాంధీ తెలిపారు. రాబోయే 7 రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించాలని వ్యంగ్యంగా అన్నారు. మరోవైపు నవంబర్ 1న నిర్వహించతలపెట్టిన నిరసన ర్యాలీలో పాల్గొనాలని విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, వ్యాపారులకు పిలుపునిచ్చారు.
దేశ ప్రజల ఓట్లను దొంగిలిస్తున్నారని, ఈ అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, మౌనంగా ఉండబోమని రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది ఓటర్ల పేర్లను తొలగించి, నియమ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీలు ప్రయోగించారని, వాటన్నిటికీ ఇప్పుడు దేశం ప్రతిస్పందిస్తోందని అన్నారు. అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ ముందుకు రావాలని, ఓటు మీదే.. పోరాటం కూడా మీదేనని సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదిలావుంటే.. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిర్వహించనున్న ర్యాలీలో అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆదేశాలు జారీచేశారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండాలని పార్టీ ఎంపీలకు సూచించారు. నవంబర్ 1న దేశరాజధానిలో నిర్వహించనున్న ర్యాలీలో దాదాపు 10 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎటువంటి అల్లర్లు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేంద్రం ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
Avinash Reddy Arrest | కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్..విడుదల
January 12 Vidudala | ‘జనవరి 12 విడుదల’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్.. ‘దివికి దివికి’ ప్రోమో విడుదల!
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

