Vijay remuneration | దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ స్టార్ హీరోల జాబితాలో విజయ్ ముందు వరుసలో ఉంటాడు. సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ సంపాదించున్న నటుడు విజయ్. ఈయన నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయి మంచి వసూళ్లను కూడా సాధించాయి. ప్రస్తుతం ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. గత సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మాస్టర్ సినిమా ఇక్కడ దాదాపు 15 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు విజయ్ నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోన్నాడు.
విజయ్ ఈ సినిమాకు రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో కొంత వాటా కూడా తీసుకోనున్నట్లు సమాచారం. అన్ని కలిపితే విజయ్‌కు దాదాపు 100 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుతున్నట్లు తెలుస్తుంది. సౌత్ లో ఈయనకున్న క్రేజ్ తో ఈ చిత్రం డబుల్ కలెక్షన్లను సాధిస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే శాటిలైట్ హక్కుల కోసం జీ స్టూడియోస్ దాదాపు 200 కోట్లు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తే విడుదలయ్యాక ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి.. దీపావళికి సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.