హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ మార్చి 6న విడుదలకానుంది. మార్చి 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. టీజీ ఐసెట్ సెట్ కమిటీ సమావేశాన్ని సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. అభ్యర్థులు మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసెట్ పరీక్షలు జూన్ 8, 9న ఆన్లైన్లో నిర్వహించనున్నారు.